TSK

TSK · 1 దిన 2:16

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

అప్పుడు సెరూయా కుమారుడు యోవాబు, దావీదు సేవకులు బయలుదేరి వారిని ఎదిరించడానికి గిబియోను లోయకు వచ్చి లోయకు వీరు ఈ వైపున, వారు ఆ వైపున దిగి ఉన్నారు.

పట్టాభిషేకం అయిన నేను ఈ రోజు బలం లేనివాడినయ్యాను. సెరూయా కొడులైన ఈ వ్యక్తులు నాకంటే బలమైనవారు. వారు చేసిన దుష్టకార్యాలను బట్టి వారు కీడు చేసిన ప్రకారం యెహోవా వారికి ప్రతీకారం చేస్తాడు గాక.”

అప్పుడు సెరూయా కుమారుడు అబీషై “ఈ చచ్చిన కుక్క నా యజమానివి, రాజువు అయిన నిన్ను శపిస్తాడా? నాకు అనుమతి ఇవ్వు, నేను వాడి తల నరుకుతాను” అన్నాడు.

¶ యోవాబు సోదరుడైన అబీషై ముగ్గురికీ నాయకుడు. ఒక యుద్ధంలో ఇతడు మూడు వందల మందిని కేవలం తన ఈటెతో హతమార్చాడు. అలా ఆ ముగ్గురితో పాటు తరచుగా ఇతని పేరు కూడా వినిపించేది.