TSK

TSK · 1 దిన 3:13

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ రెమల్యా కొడుకు పెకహు పరిపాలనలో 17 వ సంవత్సరంలో యూదా రాజు యోతాము కొడుకు ఆహాజు పరిపాలన ఆరంభించాడు.

¶ ఇశ్రాయేలు రాజు, ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో మూడో సంవత్సరంలో యూదా రాజు ఆహాజు కొడుకు హిజ్కియా ఏలడం ఆరంభించాడు.

ఆ వంశావళిలో పేర్లు ఉన్న వీరు యూదా రాజు హిజ్కియా పరిపాలించిన రోజుల్లో అక్కడకు వెళ్ళారు. అక్కడ హాము తెగల నివాసాల పైనా అక్కడే ఉన్న మేయూనిము తెగలపైనా దాడులు చేశారు. వాళ్ళను పూర్తిగా నాశనం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తమ మందలకు సరిపోయినంత మేత అక్కడ ఉండటం వల్ల వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు.

¶ హిజ్కియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా.

¶ ఉజ్జీయా కొడుకు యోతాము. యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా.