TSK

TSK · 1 దిన 9:1

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఇంకా, అతడు దేశపు ప్రజల్లో అతి పేదవారు తప్ప ఇంక ఎవరూ లేకుండా యెరూషలేము పట్టణమంతట్లో ఉన్న అధిపతులూ, పరాక్రమవంతులూ పదివేలమందినీ, వీళ్ళు కాకుండా కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను బందీలుగా తీసుకుపోయాడు.

ఏడు వేలమంది పరాక్రమవంతులను, వెయ్యిమంది కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను, యుద్ధంలో ఆరితేరిన శక్తిమంతులందర్నీ బబులోనురాజు బందీలుగా బబులోను పట్టణానికి తీసుకొచ్చాడు.

కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతులను వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసుకు వెళ్ళారు.

దేవుని మందిరం లోని వస్తువులన్నిటినీ పెద్దవీ, చిన్నవీ, యెహోవా మందిరం నిధులూ, రాజు నిధులూ, రాజు అధికారుల నిధులన్నిటినీ అతడు బబులోనుకు తీసుకు పోయాడు.

ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు.

ప్రధానులను, అధికారులను, ప్రజలను వంశాల వారీగా సమకూర్చి జనాభా లెక్క సేకరించాలని నా దేవుడు నా హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ సమయంలో మొదట తిరిగి వచ్చిన వారి గురించి రాసిన వంశావళి ఉన్న గ్రంథం నాకు కనబడింది. అందులో రాసి ఉన్న వంశావళులు ఇవి.

¶ ప్రజల అధికారులు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకడు పరిశుద్ధ పట్టణం యెరూషలేంలో నివసించాలనీ, మిగిలిన తొమ్మిదిమంది వేరు వేరు పట్టణాల్లో నివసించాలనీ చీట్లు వేసి నిర్ణయించారు.

దక్షిణదేశ పట్టణాలు మూతబడి ఉన్నాయి. వాటిని తెరిచేవాడు ఉండడు. యూదా ప్రజలంతా చెరలోకి వెళ్ళిపోయారు.

రాజు దగ్గర అంగరక్షకుల అధిపతితో పాటు వెళ్ళిన సైన్యం యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను కూల్చివేశారు.

¶ అబ్రాహాము వంశం వాడైన దావీదు వంశం వాడు యేసు క్రీస్తు వంశావళి.