TSK

TSK · 2 దిన 29:21

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

నేరం ప్రజల పైకి వచ్చేలా ఒకవేళ అభిషేకం పొందిన యాజకుడే అలాంటి పాపం చేస్తే, అతడు తన పాపం కోసం బలిగా లోపం లేని కోడెదూడని యెహోవాకు అర్పించాలి.

¶ అప్పుడు బిలాము బాలాకుతో “ఇక్కడ నా కోసం ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అన్నాడు.

బిలాము “ఇక్కడ నాకు ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అని బాలాకుతో చెప్పాడు.

చెరలోకి వెళ్ళిన వారికి పుట్టి చెర నుండి విడుదలై, తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలు దేవునికి దహన బలులు అర్పించారు. ఇశ్రాయేలీయులందరి పక్షంగా 12 ఎద్దులను, 96 పొట్టేళ్ళను, 77 గొర్రెపిల్లలను అర్పించారు. పాపపరిహారార్థ బలి కోసం 12 మేకపోతులు తెచ్చి అన్నిటినీ దహనబలిగా యెహోవాకు అర్పించారు.

ఏడు రోజులు అతడు ఏ లోపం లేని ఏడు ఎడ్లను, ఏడు పొట్టేళ్ళను తీసుకుని, రోజుకొకటి చొప్పున ఒక ఎద్దును, ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పించాలి. అలాగే ప్రతి రోజూ ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థబలిగా అర్పించాలి.