అతడు వచ్చినప్పుడు ఏలీ దారి పక్కన కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతనికి గుండె బద్దలౌతూ ఉంది. ఆ వ్యక్తి నగరంలోకి సమాచారం తెచ్చినప్పుడు అంతా కేకలు వేశారు.
TSK
TSK · 2 సమూ 18:24
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
1 సమూ 4:13
TSK
2 సమూ 18:4
TSK
¶ అందుకు రాజు “మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాను” అని చెప్పి, గుమ్మం పక్కన నిలబడినప్పుడు ప్రజలంతా గుంపులు గుంపులుగా వందల కొలదిగా, వేల కొలదిగా బయలుదేరారు.
2 రాజులు 9:17
TSK
¶ యెజ్రెయేలు ప్రాకారం మీద ఒక కాపలా వాడు కావలి కాస్తున్నాడు. వాడు ప్రాకారం పైనుండి కొంత దూరంలో వస్తున్న యెహూనూ అతనితో వస్తున్న సైనిక దళాన్నీ చూసి “ఒక సైనిక దళం రావడం నాకు కనిపిస్తుంది” అన్నాడు. అప్పుడు యెహోరాము “ఒక గుర్రపు రౌతును పిలవండి. ఆ వచ్చేవాళ్ళను కలుసుకోడానికి అతణ్ణి పంపించండి. అతడు వాళ్ళను ‘శాంతిభావంతో వస్తున్నారా’ అని అడగాలి” అని చెప్పాడు.
యెషయా 21:11
TSK
దూమా గూర్చిన ఒక దైవ ప్రకటన. శేయీరులో నుండి ఒకడు నన్ను అడుగుతున్నాడు. “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది?”