TSK

TSK · అపొస్తలుల కార్యములు 1:6

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

మొదట్లో ఉన్నట్టు న్యాయాధిపతులను మళ్ళీ నీకు ఇస్తాను. ఆరంభంలో ఉన్నట్టు నీకు సలహాదారులను మళ్ళీ నియమిస్తాను. అప్పుడు నీతిగల పట్టణం అనీ, నమ్మదగిన నగరమనీ నీకు పేరొస్తుంది.”

యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.

భూమ్యాకాశాలను గురించిన నిబంధన నిలిచి ఉండకపోతే, అప్పుడు మాత్రమే అబ్రాహాము ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని పరిపాలించడానికి అతని సంతాన సంబంధి అయిన వ్యక్తిని ఏర్పరచుకోకుండా, నేను యాకోబు సంతానంలోని నా సేవకుడైన దావీదు సంతానాన్ని తృణీకరిస్తాను. కచ్చితంగా నేను వాళ్ళ పట్ల కనికరం చూపించి వాళ్ళ భాగ్యం వాళ్లకు మళ్ళీ తీసుకొస్తాను.”

¶ ఆకాశం కింద ఉన్న రాజ్యం, అధికారం, మహాత్మ్యం మహోన్నతుని పరిశుద్ధులవి. ఆయన రాజ్యం నిత్యం నిలిచేది. అధికారులందరూ దానికి దాసులై విధేయులౌతారు. ఇంతటితో సంగతి సమాప్తం అయింది అని చెప్పాడు.

¶ యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. భూమ్యాకాశాలు కంపిస్తాయి. అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు.

¶ అయితే సీయోను కొండ మీద తప్పించుకున్న వారు నివసిస్తారు. అది పవిత్రంగా ఉంటుంది. యాకోబు వంశం వాళ్ళు తమ వారసత్వం పొందుతారు.

¶ మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవించదు.

¶ అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు, ‹“ఏలీయా ముందుగా వచ్చి అంతా చక్కబెడతాడనే మాట నిజమే.›

¶ ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు.

¶ ఒకసారి పరిసయ్యులు, ‹“దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని ఆయనను అడిగారు. దానికి ఆయన, “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు.›

‹నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి,›