యెహోవా మీ ప్రాంతంలో పడే వానను పిండిలాగా, ధూళిలాగా చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అది ఆకాశం నుంచి మీ మీద పడుతుంది.
TSK
TSK · ఆమోసు 4:11
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
అప్పుడు రాజ్యాల్లో గొప్పదిగా, కల్దీయుల శోభకూ, అతిశయానికీ కారణమైన బబులోను, దేవుడు పాడుచేసిన సొదొమ గొమొర్రాల్లాగా అవుతుంది.
వారంతా బహు ద్రోహులు, కొండెగాళ్ళు. వారు మట్టి లోహం వంటివారు, వారి అంతరంగం ఇత్తడి, ఇనుములాగా బహు కఠినంగా ఉంటాయి.
యెహోవా ఇలా చెప్తున్నాడు. “నేను సొదోమ, గొమొర్రా వాటి చుట్టూ ఉన్న పట్టణాలను నాశనం చేసినట్టే వీటికీ చేసిన తరువాత, అక్కడిలాగే ఇక్కడ కూడా ఎవరూ నివసించరు. ఏ మనిషీ అక్కడ బస చేయడు.
¶ తరువాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.
¶ ఐగుప్తు దేశానికి వారు మళ్ళీ తిరిగి పోరా? నా దగ్గరకి తిరిగి రావడానికి నిరాకరించినందుకు అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయడా?
¶ మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను. మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
సాతానుతో యెహోవా దూత “సాతానూ, యెహోవా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన నిప్పుకణం లాగానే ఉన్నాడు గదా” అన్నాడు.
¶ దైవభక్తి లేని ప్రజలకు కలిగే వినాశనానికి ఉదాహరణగా దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలపై తీర్పు విధించి వాటిని బూడిదగా మార్చాడు.
అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి.