బబులోను యెహోవా చేతిలో ఉన్న బంగారు పాత్ర. ఆ పాత్రలోని మద్యాన్ని ఆయన సర్వలోకానికీ తాగించాడు. లోకంలోని జనాలు ఆమె చేతి మద్యాన్ని తాగి పిచ్చివాళ్ళు అయ్యారు.
TSK
TSK · దానియేలు 2:32
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
రాజా, ఆ చెట్టు నీకు సూచనగా ఉంది. నువ్వు వృద్ధిచెంది గొప్ప బల ప్రభావాలు గలవాడివయ్యావు. నీ ప్రఖ్యాతి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. నీ రాజ్యం లోకమంతా వ్యాపించింది.”
బెల్షస్సరు ఆజ్ఞ ప్రకారం దానియేలుకు ఊదారంగు దుస్తులు తొడిగించారు.
¶ నేను ఊలయి అనే నది ఒడ్డున ఉన్నట్టు నాకు దర్శనం వచ్చింది. నేను కళ్ళెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ఒడ్డున నిలబడి ఉంది. దానికి రెండు కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు పొడవుగా ఉన్నాయి. అయితే ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉన్నది తరువాత మొలిచింది.
ఆ స్త్రీ ఊదారంగు, ఎర్ర రంగు వస్త్రాలు కట్టుకుని ఉంది, బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకుంది. ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో తాను చేస్తున్న అతి జుగుప్సాకరమైన పనులూ, లైంగిక అవినీతికి సంబంధించిన అపవిత్రకార్యాలూ ఉన్నాయి.