TSK

TSK · దానియేలు 7:6

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

మీరు మరణించిన తరవాత మీ రాజ్యం కంటే తక్కువ ప్రభావం ఉన్న మరో రాజ్యం పైకి వస్తుంది. తరువాత మూడో రాజ్యం సర్వలోకాన్ని పాలిస్తుంది. అది మీకు కనిపించిన ఇత్తడి వంటిది.

¶ నేను ఈ సంగతి ఆలోచిస్తుంటే ఒక మేకపోతు పడమట నుండి వచ్చి, కాళ్లు నేలపై మోపకుండా భూమి అంతటా పరుగులు తీసింది. దాని రెండు కళ్ళ మధ్య ఒక గొప్ప కొమ్ము ఉంది.

¶ బొచ్చు ఉన్న ఆ మేకపోతు గ్రీకుల రాజు. దాని రెండు కళ్ళ మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచిస్తున్నది.

¶ అంతలో శూరుడైన ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యాన్ని ఏలి యిష్టానుసారంగా జరిగిస్తాడు.

¶ నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగానూ దాని నోరు సింహం నోరులాగానూ ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, గొప్ప అధికారాన్నీ ఇచ్చాడు.