TSK

TSK · ప్రసంగి 2:8

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఇప్పటికే నాకు 80 ఏళ్ళు నిండాయి. మంచి చెడ్డలకున్న తేడా నేను కనిపెట్టగలనా? భోజన పదార్ధాల రుచి నేను తెలుసుకో గలనా? గాయకుల, గాయకురాండ్ర పాటలు నాకు వినిపిస్తాయా? నీ దాసుడనైన నేను నీకు భారంగా ఎందుకు ఉండాలి?

వారు ఓఫీరు అనే స్థలానికి వెళ్ళి అక్కడ నుండి 14, 500 కిలోగ్రాముల బంగారాన్ని రాజైన సొలొమోను దగ్గరికి తీసుకువచ్చారు.

¶ సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 టన్నులు.

అతనికి 700 మంది రాకుమార్తెలైన భార్యలూ 300 మంది ఉపపత్నులూ ఉన్నారు. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు.

రెహబాము రాజు వీటికి బదులు ఇత్తడి డాళ్లను చేయించి, రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల నాయకునికి అప్పచెప్పాడు.

¶ వీళ్ళందరూ ఆసాపుకూ, యెదూతూనుకూ, హేమానుకూ, రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో తాళాలు, స్వరమండలాలు, తీగ వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, తమ తండ్రి చేతి కింద దేవుని మందిరం సేవ జరిగిస్తూ ఉన్నారు.

సొలొమోను రాజు బంగారాన్ని సాగగొట్టి 200 డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలుకు ఆరు కిలోగ్రాముల బంగారం పట్టింది.

వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయటికి వస్తారు. వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తారు.

పొగమంచులో ఆవిరిలాగా, గాలి కదలిక లాగా ప్రతిదీ మాయమైపోతున్నదని ప్రసంగి చెబుతున్నాడు. అది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నది.

¶ బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు వినబడ్డాయి. ప్రజలంతా, దేశవాసులు, వివిధ భాషలు మాట్లాడేవాళ్లు సాష్టాంగపడి రాజు నిలబెట్టించిన విగ్రహానికి నమస్కరించారు.

¶ తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు.