TSK

TSK · ఎస్తేరు 2:5

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ధనవంతుడు ఉండేవాడు. కీషు తండ్రి అబీయేలు. అబీయేలు తండ్రి సేరోరు. సేరోరు తండ్రి బెకోరతు. బెకోరతు తండ్రి అఫీయా.

అప్పుడు యూదారాజు యెహోయాకీను, అతని తల్లి, అతని సేవకులు, అతని కింద అధిపతులూ, అతని పరివారం, బయలుదేరి బబులోనురాజు దగ్గరికి వచ్చినప్పుడు బబులోను రాజు పరిపాలనలో ఎనిమిదో సంవత్సరంలో యెహోయాకీనును చెరపట్టుకున్నాడు.

ఆ కాలంలో అహష్వేరోషు రాజు షూషను కోటలో నుండి పరిపాలన సాగిస్తున్నాడు.

కాబట్టి రాజ భవన ద్వారం దగ్గర ఉండే రాజోద్యోగులంతా రాజాజ్ఞ ప్రకారం మోకాళ్లూని హామానుకు నమస్కరించారు. మొర్దెకై మాత్రం అలా వంగలేదు, సాష్టాంగ పడలేదు.

యూదుడైన మొర్దెకై అహష్వేరోషు రాజు తరువాతి స్థానంలో ఉన్నాడు. అతడు యూదుల్లో గొప్పవాడుగా తన జాతి వారి మధ్య ప్రఖ్యాతి గాంచిన వాడయ్యాడు. అతడు తన ప్రజల క్షేమాన్ని పట్టించుకొంటూ తనవారందరితో శాంతిపూర్వకంగా మాట్లాడుతూ ఉండేవాడు.