సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “అహంకారీ, నేను నీకు విరోధంగా ఉన్నాను. నిన్ను శిక్షించే రోజూ, సమయమూ వచ్చాయి.
TSK
TSK · యెహెజ్కేలు 13:8
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేనే మీకు విరోధంగా చర్యలు తీసుకుంటాను. ఇతర జాతులు చూస్తూ ఉండగా మీ మధ్య నా తీర్పు అమలు పరుస్తాను.
¶ కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “తూరూ, నేను నీకు విరోధిని. సముద్రం దాని అలలను పైకి తెచ్చే విధంగా నేను అనేక ప్రజలను నీ మీదికి రప్పిస్తాను.
ఐగుప్తు రాజు ఫరో, నైలునదిలో పడుకున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని. నైలునది నాది, నేనే దాన్ని కలగచేశాను, అని నువ్వు చెప్పుకుంటున్నావు.
“యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, శేయీరు పర్వతమా! నేను నీకు వ్యతిరేకిని. నా చెయ్యి నీ మీద చాపి నిన్ను పాడుగా నిర్జనంగా చేస్తాను.
¶ నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు. “ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాలకు అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను.
సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “నేను నీకు విరోధిని. నీ బట్టలు నీ ముఖం పైకి ఎత్తి ప్రజలకు నీ మర్మాంగాలను చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని బట్టబయలు చేస్తాను.
శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.