TSK

TSK · యెహెజ్కేలు 40:39

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాల్లో దేనినైనా పొరపాటున ఎవరైనా చేస్తే, మీరిలా చేయండి.

¶ ఇశ్రాయేలు సమాజమంతా పొరపాటుగా తెలియకుండా పాపం చేస్తే, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని అవగాహన లేకుండా చేసి దోషులైతే

“ఒక వ్యక్తి యెహోవాకు అర్పితమైన వాటిని ముందు పొరపాటుగా ఆయనకు చెల్లించకుండా తెలియక ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే, అప్పుడు అతడు తన అపరాధ బలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకు రావాలి. అతడు తన అపరాధ బలిగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకురావాలి. ఆ పొట్టేలు విలువను ప్రత్యక్ష గుడారంలో చెలామణీ అయ్యే వెండితో నిర్ణయించాలి.

తరువాత అతడు తన అపరాధబలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకుని రావాలి. అపరాధబలిగా మందలోని లోపం లేని పోట్టేలును యాజకుడి దగ్గరికి తీసుకుని రావాలి. దాని విలువను ప్రస్తుత వెల ప్రకారం నిర్థారించాలి.

దహనబలి కోసం పశువులను వధించే స్థలం లోనే అపరాధబలి పశువులను కూడా వధించాలి. దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ అన్ని వైపులా చిమ్మాలి.

అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు. ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు. ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది.

బలిపీఠం చెక్కతో చేశారు. దాని ఎత్తు 1 మీటరు 60 సెంటి మీటర్లు, పొడవు ఒక మీటరు. దాని పీఠం, మూలలు, పక్కలు చెక్కతో చేసినవి. అతడు నాతో “ఇది యెహోవా సముఖంలో ఉండే బల్ల” అని చెప్పాడు.

వారే నా పరిశుద్ధస్థలంలో ప్రవేశిస్తారు. వారే నా బల్ల దగ్గరికి వచ్చి పరిచర్య చేస్తారు. వారే నేనప్పగించిన దాన్ని కాపాడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం నాకు అర్పిస్తూ “ఏమి చేసి నిన్ను అపవిత్రపరచాం?” అంటారు. “యెహోవా భోజనపు బల్లను అవమాన పరచడం వల్లనే గదా

‹సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను.›

ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.