TSK

TSK · ఆది 39:7

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

దైవ కుమారులు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు.

¶ నేను నా కన్నులతో ఒప్పందం చేసుకున్నాను గనక కన్యను కోరికతో ఎలా చూస్తాను?

¶ వ్యభిచారి వలలో పడకుండా, తియ్యగా మాట్లాడి మోసపుచ్చే వేశ్య బారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.

¶ వేశ్యలతో సాంగత్యం చేసేవాళ్ళకు కేవలం రొట్టెముక్క మాత్రమే మిగులుతుంది. వ్యభిచారి నీ విలువైన ప్రాణాన్ని వేటాడుతుంది.

¶ నిన్ను కలుసుకోవాలని, నీకు ఎదురు రావాలని బయలుదేరాను. నువ్వే నాకు కనబడ్డావు.

¶ ప్రతి వీధి మొదట్లో గుళ్ళు కట్టి, నీ అందాన్ని అసభ్య క్రియల కోసం వాడి, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నీ కాళ్ళు తెరిచి వాళ్ళతో ఎన్నో వ్యభిచార క్రియలు చేశావు.

నీకు, ఇతర స్త్రీలకు తేడా ఉంది. ఎందుకంటే, తమతో వ్యభిచారం చెయ్యమని ఎవరూ నిన్ను అడగరు. నువ్వే వాళ్లకు ఎదురు డబ్బు చెల్లిస్తావు! నీకెవరూ డబ్బు ఇవ్వరు.”

అష్షూరు వాళ్ళల్లో ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులనూ, అధికారులనూ, అందంగా ఉన్న యువకులనూ, గుర్రాల మీద స్వారీ చేసే వాళ్ళనూ మోహించింది.

వారి కళ్ళు వ్యభిచారపు చూపులతో నిండి ఉండి, ఎడతెగక పాపం చేస్తూ ఉంటారు. వారు, నిలకడ లేని వారిని తప్పుదారి పట్టడానికి ప్రేరేపిస్తారు. వారి హృదయాలు ఎప్పుడూ పేరాశతో సిద్ధంగా ఉంటాయి. వారు శాపానికి గురైన ప్రజలు.