¶ కరువు కాలం ముందే యోసేపుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఓను పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు వారికి తల్లి.
TSK
TSK · యెషయా 24:2
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు.
¶ కత్తిపాలు కాకుండా తప్పించుకున్న వారిని రాజు బబులోను తీసుకుపోయాడు. పారసీకుల రాజ్యం వచ్చే వరకూ వారు అక్కడే ఉండి అతనికీ అతని కొడుకులకూ దాసులుగా ఉన్నారు.
శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు,
కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుంచి తల, తోక, తాటి మట్ట, రెల్లు అన్నిటినీ ఒకే రోజు నరికేస్తాడు.
ప్రవక్తలూ యాజకులూ పాడైపోయారు. నా ఆలయంలో కూడా వాళ్ళ దుర్మార్గం నేను చూశాను. ఇది యెహోవా వాక్కు.
¶ ఎందుకంటే సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “యెరూషలేము నివాసుల పైకి నా తీవ్ర కోపమూ, నా ఉగ్రతా వచ్చినట్టే, మీరు ఐగుప్తుకు వెళ్ళినట్టయితే మీ మీద కూడా నా క్రోధాన్ని కుమ్మరిస్తాను. మీరు శాపానికి గురౌతారు. మీరు భయాన్ని పుట్టించే వాళ్ళుగా ఉంటారు. దూషణ పాలవుతారు. ఈ స్థలాన్ని మీరు ఇక మీదట చూడరు.
¶ రాజు అంగరక్షకుల అధిపతి ప్రధానయాజకుడు శెరాయానూ, రెండవ యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు కాపలా వాళ్ళనూ పట్టుకున్నాడు.
¶ దానిలో నీతిమంతుల రక్తం చిందడానికి కారణం అయిన దాని యాజకుల పాపం వల్ల, దాని ప్రవక్తల పాపం వల్ల శత్రువు ప్రవేశించాడు.
¶ అధిపతులను వాళ్ళు ఉరి తీశారు. పెద్దలను ఘనపరచలేదు.
అలాంటి వ్యక్తికి నేను విరోధంగా ఉండి అతణ్ణి సూచనగానో, సామెతగానో మారుస్తాను. ఎందుకంటే నేను అతణ్ణి నా ప్రజల్లో నుండి కొట్టివేస్తాను. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
¶ కాబట్టి జనులకు ఎలాగో యాజకులకూ అలాగే జరుగుతుంది. వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారిని శిక్షిస్తాను. వారి క్రియలనుబట్టి వారందరికీ ప్రతీకారం చేస్తాను.