వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. ప్రతిఫలమిచ్చేది నేనే. వారి ఆపద్దినం దగ్గర పడింది. వారి అంతం త్వరగా వస్తుంది.
TSK
TSK · యెషయా 34:8
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! మా మీద ప్రకాశించు.
యెహోవా దినం వస్తోంది. దేశాన్ని పాడు చెయ్యడానికీ, పాపులు దానిలో ఉండకుండా పూర్తిగా నాశనం చెయ్యడానికీ క్రూరమైన ఉగ్రతతో, ప్రచండమైన కోపంతో అది వస్తోంది.
బెదిరిన హృదయాలు గలవారితో ఇలా చెప్పండి. “భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు. చేయాల్సిన ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.”
నీతిని కవచంగా ఆయన ధరించుకున్నాడు. రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించుకున్నాడు. ప్రతీకారమనే బట్టలు వేసుకున్నాడు. ఆసక్తిని పైబట్టగా వేసుకున్నాడు.
పగ తీర్చుకునే రోజు కోసం చూశాను. నా విడుదల సంవత్సరం వచ్చింది.
¶ యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి. మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు, లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు. నీ స్వరం కొండలు వినాలి.
¶ నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు.
ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే.
¶ “పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు.”