అయినా నీ తండ్రి దావీదు కోసం నీ రోజుల్లో అలా చెయ్యను. నీ తరువాత నీ కొడుకు చేతిలోనుండి దాన్ని తీసివేస్తాను.
TSK
TSK · యెషయా 37:35
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ దావీదు హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తన జీవితమంతా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకొంటూ యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో ఏ విషయంలోనూ తప్పిపోలేదు.
¶ యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారం ఈ మహా ఘనత కలుగుతుందని నువ్వు తెలియచేశావు. అతని నిమిత్తమే నువ్వు ఈ గొప్ప కార్యం చేశావు.
నీ జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి విడిపించి కాపాడతాను.
నా నామం కోసం నేను నిన్ను నిర్మూలం చేయను. నా కోపం చూపించను. నా కీర్తి కోసం మిమ్మల్ని నాశనం చేయకుండా నీ విషయంలో నన్ను నేను తమాయించుకుంటాను.
యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.
ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు కోసం నీతి చిగురు మొలిపిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలను జరిగిస్తాడు.
¶ కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ విషయం చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులారా, నేను మీకోసం దీన్ని చేయడం లేదు. మీరు వెళ్ళిన ప్రజల మధ్య మీ మూలంగా దూషణకు గురి అయిన నా పవిత్రమైన పేరు కోసమే చేస్తాను.
¶ తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.