TSK

TSK · యిర్మీయా 16:21

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

భూమి అంతటిలో నాలాంటివాడు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ సేవకుల పైకి, నీ దేశ ప్రజల పైకి పంపుతాను.

యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా.

యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే లోకమంతట్లో మహోన్నతుడవని వాళ్ళు తెలుసుకుంటారు.

“సృష్టికర్త అయిన యెహోవా, రూపించిన దాన్ని స్థిరపరిచే యెహోవా, యెహోవా అనే పేరు గలవాడు ఇలా అంటున్నాడు,

కాబట్టి, యెహెజ్కేలు మీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిన ప్రకారం మీరూ చేస్తారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.”

¶ నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము వాళ్ళ మీద నా పగ తీర్చుకుంటాను. ఎదోమీయుల విషయంలో నా కోపాన్ని బట్టి నా రౌద్రాన్ని బట్టి, ఇశ్రాయేలీయులు నా ఆలోచన నెరవేరుస్తారు! ఎదోమీయులు నా ప్రతీకారం చవి చూస్తారు.” ఇదే యెహోవా వాక్కు.