TSK

TSK · యిర్మీయా 32:9

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

అబ్రాహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం నాలుగు వందల షెకెల్ల వెండిని అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాడు.

¶ రాజు రావడం చూసి అతడు బిగ్గరగా ఇలా అన్నాడు. “నీ సేవకుడైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్లాను. ఒక సైనికుడు నా దగ్గరికి ఒక బందీని తెచ్చి, ‘ఇతన్ని చూస్తూ ఉండు, ఎలాగైనా వాడు తప్పించుకుపోతే వాని ప్రాణానికి బదులు నీ ప్రాణం పెట్టాలి. లేకపోతే నీవు 34 కిలోల వెండి ఇవ్వాలి’ అన్నాడు.

తిండి కాని దాని కోసం మీరెందుకు వెండి తూస్తారు? తృప్తినివ్వని దానికోసం మీరెందుకు కష్టపడతారు? నా మాట జాగ్రత్తగా విని మంచివాటిని తినండి. కొవ్విన వాటితో సుఖించండి.

¶ నేను వాళ్ళతో “మీకు అనుకూలంగా ఉంటే నా జీతం నాకు ఇవ్వండి, లేకపోతే మానివెయ్యండి” అన్నాను. అప్పుడు వాళ్ళు నా జీతంగా 30 వెండి నాణాలు ఇచ్చారు.