TSK

TSK · యిర్మీయా 4:30

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ యెహూ యెజ్రెయేలులో అడుగుపెట్టిన విషయం యెజెబెలుకు తెలిసింది. కాబట్టి ఆమె తన కళ్ళ చుట్టూ రంగులు వేసుకుని కేశాలంకరణ చేసుకుని మేడపైని కిటికీలోనుండి బయటకు తొంగి చూసింది.

తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు?

సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు. దేవుణ్ణి లెక్క చెయ్యని వారికి వణుకు పట్టుకుంది. మనలో మండే అగ్నితో కలసి ప్రయాణించే వాడు ఎవరు? నిత్యమూ మండే వాటితో ఎవరు నివసిస్తారు?

వారిని నీకై నువ్వు స్నేహితులుగా చేసికొన్నావు. ఇప్పుడు వారినే ఆయన నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేం చేస్తావు? ప్రసవించే స్త్రీ పడే వేదన నీకు కలుగుతుంది కదా?

రాజువైన నువ్వు, లెబానోను అడవిలోని ఇంటిలో నివసిస్తున్న నువ్వు, దేవదారు వృక్షాల్లో గూడు కట్టుకున్నా, ప్రసవిస్తూ ఉన్న స్త్రీకి కలిగే వేదనల్లాటివి నీకు కలుగుతాయి. నువ్వెంత మూలుగుతావో!

¶ రాత్రివేళ ఎంతో శోకిస్తూ ఉంది. కన్నీటితో దాని చెంపలు తడిసిపోయాయి. దాని ప్రేమికులెవ్వరూ దాన్ని ఆదరించలేదు. దాని స్నేహితులందరూ దానికి ద్రోహం చేశారు. వాళ్ళు దాని శత్రువులయ్యారు.

¶ దొరకని సహాయం కోసం కనిపెట్టినా మా కళ్ళకు ఏదీ కనబడలేదు. రక్షించలేని ప్రజల కోసం మా కళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి.

కాబట్టి దాని విటులకు నేను దాన్ని అప్పగించాను. అది మోహించిన అష్షూరు వాళ్లకు దాన్ని అప్పగించాను.

¶ ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, చూడు! నువ్వు ద్వేషించిన వాళ్ళకూ, నీ మనస్సు దూరమైన వాళ్ళకూ నిన్ను అప్పగిస్తున్నాను.

నిన్ను చంపేవాళ్ళ ఎదుట, ‘నేను దేవుణ్ణి’ అంటావా? నువ్వు మనిషివే గానీ దేవుడివి కాదు గదా! నిన్ను పొడిచేవాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటావు.

¶ నీతో సంధి చేసినవారు నిన్ను తమ సరిహద్దు వరకూ పంపేస్తారు. నీతో సమాధానంగా ఉన్నవాళ్ళు నిన్ను మోసగించి ఓడిస్తారు. నీ అన్నం తిన్నవాళ్ళు నిన్ను పట్టుకోడానికి వల వేస్తారు. ఎదోము అర్థం చేసుకోలేడు.

భూమిపై రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు” అన్నాడు.

వీరికి ఒకే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు తమ శక్తినీ అధికారాన్నీ మృగానికి అంకితం చేస్తారు.