వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి.
TSK
TSK · యిర్మీయా 49:29
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
అప్పుడు జెబహు సల్మున్నాలు “వయస్సునుబట్టి మనిషికి శక్తి ఉంటుంది గనుక, నువ్వే లేచి, మమ్మల్ని చంపు” అన్నారు. గిద్యోను లేచి జెబహును, సల్మున్నాను చంపి, వాళ్ళ ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.
¶ యుద్ధంలో వాళ్ళకు దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా హగ్రీ జాతి వాళ్ళూ, వాళ్ళతో ఉన్న వాళ్ళంతా ఓడిపోయారు. యుద్ధంలో ఇశ్రాయేలీయులు దేవునికి విజ్ఞాపన చేశారు. వాళ్ళు తన పైన నమ్మకముంచారు గనక దేవుడు వాళ్ళ ప్రార్థనను అంగీకరించాడు.
చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే.
అది ఇంకెన్నడూ నివాసస్థలంగా ఉండదు. తరతరాల్లో ఇంక దానిలో ఎవడూ కాపురం ఉండడు. అరబీయుడు అక్కడ తన గుడారం వెయ్యడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు.
కీడు తరవాత కీడు వస్తూ ఉంది. దేశమంతా నాశనమైంది. హటాత్తుగా నా గుడారాలు, క్షణాల్లో వాటి తెరలు పాడైపోయాయి.
నా గుడారం చిందర వందర అయ్యింది. నా డేరా తాళ్ళు అన్నీ తెగిపోయాయి. వారు నా పిల్లలను తీసుకెళ్ళిపోయారు. అందుకే వారు లేరు. నా డేరా నిలబెట్టడానికి, వాటి తెరలు వేయడానికి నా దగ్గర ఎవరూ లేరు.
ఇక్కడ నేనేం చూస్తున్నాను? వాళ్ళు భయకంపితులయ్యారు. పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైన్యాలు ఓడిపోయాయి. వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా సురక్షితమైన చోటును వెదుక్కుంటూ వేగంగా పారిపోతున్నారు. అన్నివేపులా భయం ఆవరించింది. యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
దమస్కు ఎంతో బలహీనంగా ఉంది. పారిపోడానికి అది వెనక్కు తిరిగింది. దాన్ని భయం పట్టుకుంది. నిస్పృహ దాన్ని ఆవరించింది. ప్రసవించే స్త్రీ పడే వేదన వంటి వేదన దానికి కలిగింది.”
¶ అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు.