ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదు పదార్థాలు నాకు తినిపిస్తాడు.
TSK
TSK · యిర్మీయా 9:14
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
“నాలో అపవిత్రత లేదు, బయలు దేవుళ్ళ వెనక నేను వెళ్ళడం లేదు” అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? లోయల్లో నీవెలా ప్రవర్తించావో చూడు. నువ్వు చేసిన దాన్ని గమనించు. నువ్వు విచ్చలవిడిగా తిరిగే ఒంటెవి.
¶ అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు.
కాబట్టి సేనల ప్రభువు యెహోవా ఈ ప్రవక్తలను గురించి చెప్పేదేమిటంటే, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతా వ్యాపించింది. కాబట్టి వాళ్లకు తినడానికి చేదుకూరలూ తాగడానికి విషజలం నేను వారికిస్తాను.
¶ చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు.
¶ వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది.
పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.
¶ మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు.