¶ యెహోవా దావీదుకు నాలుగు దిక్కులా అతని శత్రువుల మీద విజయాలు అనుగ్రహించి, నెమ్మది కలుగజేసిన తరువాత అతడు తన పట్టణంలో నివాసమున్నాడు. దావీదు నాతాను అనే ప్రవక్తను పిలిపించి,
TSK
TSK · యోబు 34:29
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ రాజైన హిజ్కియా పరిపాలనలో నాలుగో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో ఏడో సంవత్సరంలో, అష్షూరురాజు షల్మనేసెరు షోమ్రోను పట్టణంపై దండెత్తి దాన్ని చుట్టుముట్టాడు.
¶ అంతేకాక యాజకులూ ప్రజల్లో నాయకులంతా అన్య ప్రజలు చేసే నీచమైన పనులు చేస్తూ యెరూషలేములో యెహోవా ప్రతిష్టించిన మందిరాన్ని అపవిత్ర పరచారు.
నేను తూర్పు దిశకు వెళ్లినా ఆయన అక్కడ లేడు. పడమటి దిశకు వెళ్లినా ఆయన కనబడడం లేదు.
అయితే మార్పు లేనివాడు. ఆయనను దారి మళ్ళించ గలవాడెవడు? ఆయన తనకు ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు.
యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతూ ఉంటావు? ఎంతకాలం ముఖం దాచుకుంటావు?
యెహోవా, నీ దయతో నన్ను ఒక పర్వతంలాగా స్థిరంగా నిలబెట్టావు. అయితే నువ్వు నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు నాలో కలవరం మొదలైంది.
యెహోవా, నా ఆత్మ సోలిపోయింది. త్వరగా నాకు జవాబియ్యి. నీ ముఖం దాచుకోవద్దు. అలా చేస్తే నేను సమాధిలోకి దిగిపోయినవాడిలాగా అవుతాను.
తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.
¶ ఏ దేశం, ఏ రాజ్యం బబులోను రాజు నెబుకద్నెజరు సేవ చేయదో, బబులోను రాజు కాడిని తన మెడ మీద పెట్టుకోదో ఆ దేశాన్ని నేను శిక్షిస్తాను. అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకూ ఆ దేశాన్ని కత్తితో కరువుతో అంటు రోగాలతో శిక్షిస్తాను.’ ఇది యెహోవా వాక్కు.
¶ ‹శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.›
అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.