TSK

TSK · యోనా 4:8

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ అప్పుడు మోషే అహరోనుతో “నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను. ప్రజలందరి ముందూ నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే” అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు.

¶ అప్పుడు రాజు సాదోకును పిలిచి “దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోకి తీసుకువెళ్ళు. యెహోవా దృష్టికి నేను దయ పొందితే ఆయన నన్ను తిరిగి రప్పించి

నా పిత్రార్జితాన్ని నీకివ్వనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పినందువల్ల అహాబు విచారంగా కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. మంచం మీద పడుకుని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు.

అందుకని నన్ను ఉరి తీయాలని కోరుతున్నాను. నా అస్థిపంజరాన్ని నేను చూసుకోవడం కన్నా చనిపోవడమే నాకు ఇష్టం.

పగలు సూర్యుడు గానీ రాత్రి చంద్రుడు గానీ నీకు హాని చెయ్యరు.

నల్లగా ఉన్నానని నన్ను అలా చూడొద్దు. ఎండ తగిలి అలా అయ్యాను. నా సోదరులు నా మీద కోపంగా ఉన్నారు. నన్ను ద్రాక్షతోటలకు కావలిగా ఉంచారు. అయితే నా సొంత ద్రాక్షతోటను నేను కాయలేదు.

¶ కాని, అతికోపంతో ఆ ద్రాక్షవల్లిని పెకలించి నేల మీద పడేయడం జరిగింది. తూర్పుగాలి విసిరినప్పుడు దాని పళ్ళు ఎండిపోయాయి. దాని గట్టికొమ్మలు తెగి, వాడిపోయి, కాలిపోయాయి.

¶ అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది.

కాబట్టి, యెహోవా, ఇప్పుడు నా ప్రాణం తీసెయ్యమని బతిమాలుతున్నాను. ఎందుకంటే నేను బతకడం కంటే చావే మేలు.”

‹నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.›