TSK

TSK · యెహో 7:6

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ రూబేను ఆ గుంట దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు యోసేపు అందులో లేకపోవడంతో అతడు తన బట్టలు చింపుకున్నాడు.

¶ అప్పుడు, ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూసిన వారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బట్టలు చింపుకుని,

తక్షణమే నేను వారిని నాశనం చేస్తాను” అని చెప్పినప్పుడు, వారు సాగిలపడ్డారు.

రెండో రోజున ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకున్నారు. మొదటి రోజు తాము నిలబడిన స్థానాల్లోనే తిరిగి నిలబడ్డారు.

తరువాత వారంతా బేతేలుకు వెళ్ళారు. అక్కడే సాయంత్రం వరకూ దేవుని సన్నిధిలో కూర్చున్నారు.

మూడవ రోజు ఒకడు తన బట్టలు చింపుకుని, తల మీద బూడిద పోసుకుని సౌలు సైన్యం నుండి వచ్చాడు.

¶ యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డను మొత్తి జబ్బు పడేలా చేశాడు.

అతడు లేచి తన బట్టలు చించుకుని నేలపై పడి ఉన్నాడు. అతని సేవకులంతా తన బట్టలు చించుకుని రాజు దగ్గర నిలబడి ఉన్నారు.

¶ ఎజ్రా దేవుని మందిరం ముందు సాష్టాంగపడి విలపిస్తూ, పాపం ఒప్పుకొంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిన్నలూ గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వచ్చి గట్టిగా రోదించారు.

¶ జరిగినదంతా మొర్దెకై విన్నాడు. అతడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకున్నాడు. నగరం నడిబొడ్డుకు వెళ్లి మహా శోకంతో విలపించాడు.

¶ అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు.

¶ సీయోను కుమారి పెద్దలు మౌనంగా నేల మీద కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ళ తలల మీద దుమ్ము పోసుకున్నారు. వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము కన్యలు తల నేలకు దించుకుని ఉన్నారు.

తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, “అయ్యో, అయ్యో, ఆ మహా నగరం. సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయిందే” అంటారు.