TSK

TSK · యెహో 8:4

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

వారిని ఆత్రుతగా తరమడానికి హాయిలో ఉన్న వారందరూ పోగై యెహోషువను తరుముతూ పట్టణానికి దూరంగా వెళ్లిపోయారు.

కాబట్టి, ఈ రాత్రి నువ్వు, నీతో ఉన్న మనుషులు, లేచి పొలంలో మాటు వెయ్యండి.

ఇశ్రాయేలు సైనికులందరూ సిద్ధపడి బయల్తామారు అనే చోట యుద్ధం కోసం బారులు తీరారు. ఈ లోగా మాటున దాగి ఉన్న సైనికులు తాము దాగి ఉన్న స్థలం నుండి గిబియాకు పడమటి వైపునుండి వేగంగా వచ్చారు.

సైన్యాలకు అధిపతి అయిన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ‘అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన కీడు నాకు జ్ఞాపకం ఉంది. వారు ఐగుప్తు విడిచి రాగానే మార్గ మధ్యంలో అమాలేకీయులు వారిపైకి వచ్చి దాడి చేశారు కదా.

¶ అప్పుడు రాజు రాత్రి వేళ లేచి తన సేవకులను పిలిచాడు. వాళ్ళతో “ఇప్పుడు సిరియా వారు మనకేం చేశారో చెప్తాను చూడండి. మనం ఆకలితో నకనకలాడుతున్నామని వాళ్ళకు తెలుసు. వారు ‘వీళ్ళు పట్టణంలో నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళను సజీవంగా పట్టుకుని మనం పట్టణంలో ప్రవేశిద్దాం’ అని చెప్పుకుని శిబిరం విడిచి బయటకు వెళ్ళి దాక్కున్నారు” అన్నాడు.

¶ కాబట్టి నేనిలా అనుకున్నాను “బలం కంటే తెలివి శ్రేష్ఠమేగాని బీదవారి తెలివిని, వారి మాటలను ఎవరూ లెక్కచేయరు.”