ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో పాపం చేసి, బయలు దేవుళ్ళను పూజించారు.
TSK
TSK · న్యాయా 2:13
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో మళ్ళీ చెడుగా ప్రవర్తించి యెహోవాను విడిచిపెట్టి ఆయన సేవ మాని, బయలులు, అష్తారోతులు అనే అరామీయుల దేవతలను, సీదోనీయుల దేవుళ్ళను, మోయాబీయుల దేవుళ్ళను, అమ్మోనీయుల దేవుళ్ళను, ఫిలిష్తీయుల దేవుళ్ళను, పూజించడం మొదలుపెట్టారు.
¶ అప్పుడు వారు, ‘మేము యెహోవాను నిర్లక్ష్యం చేసి బయలు దేవుళ్ళనూ అష్తారోతు దేవిని పూజించడం ద్వారా పాపం చేశాం. మా శత్రువుల చేతి నుండి నువ్వు మమ్మల్ని విడిపించు. నిన్ను మాత్రమే సేవిస్తాం’ అని యెహోవాను వేడుకున్నారు.
¶ సొలొమోను అష్తారోతు అనే సీదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల అసహ్యమైన విగ్రహాన్నీ అనుసరించి నడిచాడు.
యెరూషలేము ఎదుట ఉన్న నాశనం అనే పర్వతపు కుడివైపు అష్తారోతు దేవత అనే సీదోనీయుల విగ్రహానికీ, కెమోషు అనే మోయాబీయుల విగ్రహానికీ, మిల్కోము అనే అమ్మోనీయుల విగ్రహానికీ ఇశ్రాయేలు రాజు సొలొమోను కట్టించిన ఉన్నత స్థలాలను రాజు అపవిత్రం చేశాడు.
బెన్ హిన్నోము లోయలో ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుటనుంచి యెహోవా తోలివేసిన ప్రజల నీచమైన అలవాట్ల ప్రకారం తన కొడుకులను దహనబలిగా అర్పించాడు.
వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి.
అప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట చెబుతున్నాడు. మీ పూర్వీకులు నన్ను విడిచి వేరే దేవుళ్ళను అనుసరించి పూజించి వాటికి మొక్కారు. వాళ్ళు నన్ను వదిలేసి నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.
యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు.