యెహోవా మందిరాన్నీ, రాజనగరునూ, యెరూషలేములో ఉన్న ఇళ్ళన్నీ, గొప్పవాళ్ళ ఇళ్ళన్నీ అగ్నితో తగల బెట్టించాడు.
TSK
TSK · విలాప వాక్యములు 2:5
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
ఆయన తీవ్రమైన ఆగ్రహం నా మీద రగులుకుంది. నన్ను ఒక శత్రువుగా ఆయన భావించాడు.
కానీ నేను అరీయేలును ముట్టడిస్తాను. అప్పుడు అది దుఃఖించి విలపిస్తుంది. అందుచేత అది నిజంగా నాకు నిప్పుల కుప్పలా ఉంటుంది.
సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి. విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి.
నీ ప్రేమికులంతా నిన్ను మరిచిపోయారు. వాళ్ళు నీ కోసం చూడరు. ఎందుకంటే, అధికమైన నీ పాపాలనుబట్టి, నీ గొప్ప దోషాన్నిబట్టి, ఒక కఠినమైన యజమాని పెట్టే క్రమశిక్షణ కింద నిన్ను ఉంచి, ఒక శత్రువు గాయపరిచినట్టు నేను నిన్ను గాయపరిచాను.
¶ యాకోబు పట్టణాల్లో ఒక్క దాని మీద కూడా కనికరం లేకుండా ప్రభువు అన్నిటినీ మింగివేశాడు. తన ఆగ్రహంతో ఆయన యూదా కుమార్తె కోటలను కూలగొట్టాడు. ఆయన వాటిని నేల కూల్చి సిగ్గు పరిచాడు. దాని రాజ్యాన్నీ, దాని అధిపతులను ఆయన అవమానపరిచాడు.
ఆయన ఆ చుట్ట నా ఎదుట విప్పి పరిచాడు. దానికి రెండు వైపులా రాసి ఉంది. దాని పైన గొప్ప విలాపం, రోదన, వ్యాకులంతో నిండిన మాటలు రాసి ఉన్నాయి.