TSK

TSK · లేవీ 11:13

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

వేటాడే ఏ పక్షికైనా ఆ దారి తెలియదు. డేగ కళ్ళు దాన్ని చూడలేదు.

గరుడ పక్షి నీ ఆజ్ఞకు లోబడే ఆకాశవీధి కెక్కుతుందా? తన గూడును ఎత్తయిన చోట కట్టుకుంటుందా?

నా ప్రజలు మూర్ఖులు. వారికి నేను తెలియదు. వారు తెలివితక్కువ పిల్లలు, వారికి గ్రహింపు లేదు. చెడు జరిగించడంలో వారికి నైపుణ్యం ఉంది గానీ మంచి చేయడం వారికి అసలు తెలియదు.

¶ మమ్మల్ని తరిమే వాళ్ళు ఆకాశంలో ఎగిరే గద్దలకన్నా వేగం గల వాళ్ళు. పర్వతాల్లోకి వాళ్ళు మమ్మల్ని తరిమారు. అరణ్యంలో మా కోసం కాచుకుని ఉన్నారు.

¶ వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి. రాత్రిలో తిరుగులాడే తోడేళ్లకంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు. ఎరను పట్టుకోడానికి గరుడ పక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు.

¶ వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు.

ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.