¶ కాబట్టి మీరు నా శాసనాలను నా విధులను పాటించి వాటి ననుసరించి నడుచుకోవాలి.
TSK
TSK · లేవీ 26:6
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
మీ మధ్యకు క్రూరమృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను ఎత్తుకుపోతాయి. మీ పశువులను నాశనం చేస్తాయి. మిమ్మల్ని కొద్ది మందిగా చేస్తాయి. మీ దారులు నిర్మానుష్యమై పోతాయి.
అయితే వారు అలా ఉండడం ఆరంభించినప్పుడు వారు యెహోవా పట్ల భయభక్తులు లేని వారు గనుక యెహోవా వాళ్ళ మధ్యకు సింహాలను పంపాడు. అవి వాళ్ళల్లో కొంతమందిని చంపాయి.
ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు, అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు.
ఎవరి భయమూ లేకుండా నువ్వు నిద్రపోతావు. అనేకమంది నీ సహాయం కోరుకుంటారు.
యెహోవా, శాంతిసమాధానాలతో నేను పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే నువ్వు మాత్రమే నాకు క్షేమం, భద్రత ఇస్తావు.
యెహోవా దేవుడు తెలియచేసే మాట నేను వింటాను, ఆయన తన ప్రజలతో తన నమ్మకమైన అనుచరులతో శాంతితో మసలుతాడు. అయితే వాళ్ళు మళ్ళీ మూర్ఖులు కాకూడదు.
అప్పుడు మా పశువులు ఎన్నో దూడలు ఈనతాయి. అవేవీ మా కంచెలు విరగ్గొట్టుకుని పరుగులెత్తకుండా ఉండాలి. మా వీధుల్లో ఎలాటి గలాటా ఉండకూడదు.
¶ పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు.
ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.
అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిలో కాలు మోపవు. అవి అక్కడ కనబడవు. విమోచన పొందినవారు మాత్రమే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు.
కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, ‘ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా ఆ దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు.
నీకు విరోధంగా కరువునూ, వినాశనాన్నీ పంపిస్తాను. దాంతో నువ్వు సంతానం లేకుండా ఉంటావు. తెగులూ, రక్తపాతం నీకు కలుగుతాయి. నీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతాను. ఈ ప్రకటన చేస్తున్నది నేనే, యెహోవాను.”
¶ నేను దేశానికి విరోధంగా ఖడ్గాన్ని పంపి ‘ఖడ్గమా, దేశమంతా సంచరించి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చెయ్యి’ అని ఆజ్ఞ ఇస్తే
¶ అవి అరణ్యంలో నిర్భయంగా నివసించేలా, అడవిలో క్షేమంగా పడుకునేలా నేను వాటితో శాంతి ఒడంబడిక చేస్తాను. దేశంలో క్రూర జంతువులు లేకుండా చేస్తాను.
¶ “ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను.
¶ దానికి బదులు, ప్రతివాడూ ఎవరి భయమూ లేకుండా తన ద్రాక్షచెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. ఇది సేనల అధిపతి యెహోవా నోట వెలువడ్డ మాట.
¶ ఈ చివరి మందిరం మహిమ మునుపటి మందిరం మహిమను మించి పోతుందని సేనల ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలంలో నేను శాంతిసమాధానాలు నిలుపుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
¶ ‹శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.›
¶ విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము.