TSK

TSK · మార్కు 15:34

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

నా దేవా, నా దేవా, నువ్వు నన్నెందుకు విడిచిపెట్టేశావు? నన్ను రక్షించడానికీ, నా వేదన వాక్కులు వినడానికీ, నువ్వు దూరంగా ఎందుకున్నావు?

నా ఆశ్రయశిల అయిన దేవునితో ఇలా అంటాను. నువ్వు నన్నెందుకు మర్చిపోయావు? శత్రువు నన్ను అణగదొక్కుతూ ఉంటే నేను రోదిస్తూ ఎందుకు తిరగాలి?

దీనులు, అవస్థలో ఉన్నవారు నీటి కోసం వెదుకుతున్నారు. నీళ్లు దొరక్క వారి నాలుక దప్పికతో ఎండిపోతున్నది. యెహోవా అనే నేను వారికి జవాబిస్తాను. ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడిచిపెట్టను.

¶ నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు మర్చిపోతావు? మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తావా?

సుమారు మూడు గంటలప్పుడు యేసు, ‹“ఏలీ, ఏలీ, లామా సబక్తానీ”› అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, ‹“నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?”› అని అర్థం.

¶ అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, ‹“తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.”› అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు.

¶ ఆయన శరీరంతో ఉన్నప్పుడు తనను మరణం నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలూ, మనవులూ చేస్తూ కన్నీళ్ళతో మొర్ర పెట్టుకున్నాడు. దేవునిపై ఆయనకున్న పూజ్యభావం వల్ల దేవుడు వాటిని ఆలకించాడు.