TSK

TSK · మార్కు 7:34

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు. మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు.

యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి ‹“నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు”› అన్నాడు.

యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.

మూడు గంటలకు యేసు, ‹“ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!”› అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, ‹“నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?”› అని అర్థం.

దానికి యేసు, ‹“చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది”› అని వాడితో చెప్పాడు.

¶ ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, ‹“అతణ్ణి ఎక్కడ పెట్టారు?”› అన్నాడు.

¶ యేసు తనలో తాను మూలుగుతూ ఆ సమాధి గుహ దగ్గరికి వెళ్ళాడు. ఒక రాయి దానికి అడ్డంగా నిలబెట్టి ఉంది.

¶ ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, ‹“లాజరూ, బయటికి రా!”› అన్నాడు.

“ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేశాడు, నీవు లేచి నీ పడక సర్దుకో” అని అతనితో చెప్పగానే

మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు.