TSK

TSK · మార్కు 9:35

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

కానీ నీ కోసం నువ్వు గొప్ప వాటిని కోరుకుంటున్నావా? గొప్ప వాటి కోసం చూడకు. ఎందుకంటే సర్వ మానవాళికీ వినాశనం కలుగబోతుంది.’ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘కానీ నువ్వు వెళ్ళిన స్థలాలన్నిటిలో దోపిడీ సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణాన్ని నీకిస్తున్నాను.’”

‹మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి.›

‹కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘మిత్రమా, పై స్థానానికి వెళ్ళు.’ అనవచ్చు. అప్పుడు నీకు అందరి ముందూ గౌరవం కలుగుతుంది.›

‹మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి.›