TSK

TSK · మత్తయి 1:5

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ నూను కుమారుడు యెహోషువ ఇద్దరు గూఢచారులను పిలిచి “మీరు వెళ్ళి ఆ దేశాన్ని, మరి ముఖ్యంగా యెరికో పట్టణం చూడండి” అని వారితో చెప్పి, షిత్తీము నుండి వారిని రహస్యంగా పంపాడు. వారు వెళ్లి రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ బస చేశారు.

వాళ్ళిద్దరూ మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఒకామె పేరు ఓర్పా, రెండవ ఆమె పేరు రూతు.

ఆ విధంగా నయోమి, మోయాబీయురాలైన ఆమె కోడలు రూతు తిరిగి వచ్చారు. వారిద్దరూ బార్లీ పంట కోసే కాలం ఆరంభంలో బేత్లెహేము చేరుకున్నారు.

నయస్సోనుకు శల్మాను పుట్టాడు, శల్మానుకు బోయజు పుట్టాడు.

¶ దావీదు యెష్షయి కొడుకు. యెష్షయి ఓబేదు కొడుకు. ఓబేదు బోయజు కొడుకు. బోయజు శల్మాను కొడుకు. శల్మాను నయస్సోను కొడుకు.

అలానే వేశ్య రాహాబు కూడా వార్తాహరులను ఆహ్వానించి వేరొక మార్గంలో వారిని పంపివేయడాన్ని బట్టి తన క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా ఎంచ బడింది గదా?