¶ దావీదు పరిపాలిస్తున్న కాలంలో మూడేళ్ళపాటు కరువు కొనసాగింది. దావీదు యెహోవాతో మనవి చేశాడు. అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “సౌలు గిబియోనీయులను హతమార్చాడు. అతణ్ణి బట్టి, నరహంతకులైన అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు ఏర్పడింది.”
TSK
TSK · మీకా 6:9
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
దుమ్ము నుండి కష్టాలు పుట్టవు. భూమిలోనుండి బాధ మొలవదు.
నేను దేవునితో మాట్లాడతాను. నా మీద నేరం మోపకు. నువ్వు నాతో ఎందుకు వాదం పెట్టుకున్నావో చెప్పమని అడుగుతాను.
యెహోవా తనను ప్రత్యక్షం చేసుకున్నాడు. తీర్పును ఆయన అమలు చేశాడు. దుర్మార్గుడు తన క్రియల్లో తానే చిక్కుకున్నాడు. సెలా.
యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే లోకమంతట్లో మహోన్నతుడవని వాళ్ళు తెలుసుకుంటారు.
¶ బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. ఆజ్ఞానులు అనాలోచనగా పోయి బాధలు కొని తెచ్చుకుంటారు.
అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర.
యెహోవా, నువ్వు నీ చేతిని ఎత్తావు. కానీ వాళ్ళది గమనించలేదు. కానీ వాళ్ళు ప్రజల కొరకైన నీ ఆసక్తిని చూస్తారు. అప్పుడు వాళ్లకి అవమానం కలుగుతుంది. ఎందుకంటే నీ శత్రువుల కోసం మండే అగ్ని వాళ్ళని దహించి వేస్తుంది.
చూడండి! ఆయన ఆగ్రహంతో మండిపోతూ దట్టమైన పొగతో యెహోవా పేరు దూరం నుండి వస్తూ ఉంది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి పోయాయి. ఆయన నాలుక దహించే అగ్ని జ్వాలలా ఉంది.
వినండి “ప్రకటించండి” అని ఒక స్వరం పలికింది. “నేనేం ప్రకటించాలి?” మరొక స్వరం పలికింది. “శరీరులంతా గడ్డివంటివారు, వారి అందమంతా అడవి పువ్వులాటిది.
పొలంలోకి వెళ్లి చూసినప్పుడు కత్తితో చచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పట్టణంలోకి వెళ్లి చూస్తే కరువుతో అలమటించే వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రవక్తలూ యాజకులూ తెలివిలేక తిరుగుతున్నారు.”
నేను షిలోహుకు చేసినట్టు ఈ మందిరానికి కూడా చేస్తాను. ఈ పట్టణాన్ని భూమిపై ఉన్న రాజ్యాలన్నిటికీ శాపంగా చేస్తాను.”
కల్దీయులు మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాని పట్టుకుని అగ్నితో కాల్చేస్తారు.’”
¶ నాకు మీ పట్ల కనికరం లేదు. నేను మిమ్మల్ని వదలను. మీరు చేసినట్టే నేనూ మీకు చేస్తాను. మిమ్మల్ని శిక్షించే యెహోవాను నేనే అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!
¶ ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.
¶ యూదా మీద నేను అగ్ని పంపిస్తాను. అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.”
¶ మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను. మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
¶ యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు.
¶ అది దేవుని మాట ఆలకించలేదు. శిక్షకు అంగీకరించ లేదు. యెహోవా పట్ల విశ్వాసముంచదు. దాని దేవుని దగ్గరికి రాదు.
‹నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.›