TSK

TSK · సంఖ్యా 13:32

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా బలవంతులు. అక్కడి పట్టణాలు పెద్దవి. అవన్నీ బ్రమ్హాండమైన ప్రాకారాలు ఉన్న పట్టణాలు. అక్కడ మేము అనాకు వంశం వారిని చూశాం.

మనమెక్కడికి వెళ్లగలం? అక్కడి ప్రజలు మన కంటే బలిష్ఠులు, ఎత్తయినవారు. ఆ పట్టణాలు గొప్పవి, ఆకాశాన్నంటే ప్రాకారాలతో ఉన్నాయి. అక్కడ అనాకీయులను చూశాం” అని మన సోదరులు చెప్పి మా హృదయాలు కరిగిపోయేలా చేశారు అని అన్నారు.

¶ మళ్ళీ గాతులో యుద్ధం జరిగింది. చాలా పొడవుగాగా ఉన్న వాడొకడు అక్కడ ఉన్నాడు. అతని చేతులకూ కాళ్ళకు, ఆరేసి చొప్పున ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతతికి చెందిన వాడు.

నా ఇశ్రాయేలీయులు మీ మీద నడుస్తారు. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు. మీరు వారికి వారసత్వంగా ఉంటారు. వాళ్ళ పిల్లలను ఇక ఎంత మాత్రం మీరు చంపరు.

¶ దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా! పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ నేను నాశనం చేశాను గదా!

¶ ‹“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు.›