TSK

TSK · సంఖ్యా 29:1

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

మొదటి రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదు.

“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఏడో నెల మొదటి రోజు మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ కొమ్ము బూరధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలి.

¶ ఎనిమిదో రోజు మీకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.

¶ ఏడవ నెల మొదటి రోజు నుండి యెహోవాకు దహన బలులు అర్పించడం ఆరంభించారు. అయితే యెహోవా మందిరానికి ఇంకా పునాది వేయలేదు.

ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున గ్రంథాన్ని చదువుతుండగా అర్థం చేసుకోగలిగే స్త్రీ పురుషులు కలసి ఉన్న సమూహం ఎదుటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చాడు.

నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు.

¶ యెహోవా వారికి పైగా ప్రత్యక్షమౌతాడు. ఆయన బాణాలు మెరుపువలె వెలువడుతాయి. ప్రభువగు యెహోవా శంఖం పూరిస్తూ దక్షిణ దిక్కునుండి వచ్చే గొప్ప సుడిగాలితో బయలు దేరుతాడు.

నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు?