గ్రామాల దగ్గర అతడు పొంచి ఉంటాడు, రహస్య ప్రదేశాల్లో నిరపరాధులను హత్య చేస్తాడు. నిస్సహాయులైన బాధితుల కోసం అతడి కళ్ళు వెతుకుతాయి.
TSK
TSK · సామెత 1:11
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
కారణం లేకుండానే వాళ్ళు నన్ను పట్టుకోడానికి వల వేశారు. కారణం లేకుండానే వాళ్ళు నా ప్రాణం తీయాలని నా కోసం గుంట తవ్వారు.
వారు దురాలోచనలు చేస్తూ తమను తాము ప్రోత్సాహ పరచుకుంటారు. చాటుగా వల పన్నడానికి ఆలోచిస్తారు. మనలను ఎవరు చూస్తారులే అని చెప్పుకుంటారు.
¶ వాళ్ళు తమ స్వంత నాశనానికే మాటు వేస్తారు. తాము పట్టబడతామని దాక్కుని ఉంటారు.
¶ మంచివారి ఇళ్ళ దగ్గర పొంచి ఉండి దాడి చేసే దురాత్ముల్లాగా ఉండకు. వారి గృహాలను పాడు చేయకు.
¶ దేశంలో ఉండకుండాా దరిద్రులను మింగేస్తూ మనుషుల్లో ఉండకుండాా పేదలను నశింపజేయడానికి కత్తుల్లాటి పళ్లు, పదునైన దవడ పళ్లు ఉన్న వారి తరం ఉంది.
అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. “మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి” అని వారు చెప్పుకున్నారు.
భక్తులు దేశంలో లేకుండా పోయారు. ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు. హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు.
‹‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది.›
“దయచేసి పౌలును యెరూషలేముకు పిలిపించండి” అని ఫేస్తును వారు కోరారు. ఎందుకంటే వారు అతణ్ణి దారిలో చంపడానికి కాచుకుని ఉన్నారు.