TSK

TSK · సామెత 11:24

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ కాబట్టి మీరు తప్పకుండా అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన యెహోవా దేవుడు మీ పనులన్నిటిలో, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

అతడు ఉదారంగా పేదలకు దానం చేస్తాడు. అతని నీతి నిత్యం నిలిచి ఉంటుంది. అతడు ఘనత పొందుతాడు.

¶ పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.

నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి. చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది.

¶ మీరు ఎక్కువ విత్తనాలు చల్లినా పండింది కొంచెమే. మీరు భోజనం చేస్తున్నప్పటికీ ఆకలి తీరడం లేదు. మీరు ద్రాక్షరసం తాగుతున్నప్పటికీ మత్తు రావడం లేదు. బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగడం లేదు. పనివారు కష్టపడి జీతం సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది.

¶ అప్పటి నుండి ఒకడు ఇరవై కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుతున్నది. ఏభై కొలల తొట్టి దగ్గరికి ఒకడు రాగా ఇరవై కొలలు మాత్రమే దొరకుతున్నది.

¶ ‹ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.”›

అందుచేత సోదరులు ముందుగానే మీ దగ్గరికి వచ్చి పూర్వం మీరు వాగ్దానం చేసిన విరాళం పోగుచేయాలని ప్రోత్సహించడానికి వారిని పంపడం అవసరమని నేను భావించాను. తద్వారా మీ విరాళం బలవంతంగా ఇచ్చింది కాకుండా స్వచ్ఛందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.