అయితే మా శత్రువులూ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాల ప్రజలూ జరిగిన పని చూసి ఎంతో భయపడ్డారు. మా దేవుని సహాయం వల్లనే ఈ పని మొత్తం జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారు.
TSK
TSK · కీర్తన 129:5
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
యూదులు తమ శత్రువులందరి పైనా దాడి చేసి కత్తివాత హతమార్చి, నాశనం గావించి తమ ఇష్టం వచ్చినట్టు తమను ద్వేషించిన వారికి చేశారు.
నా ప్రాణం తీయాలని చూసే విరోధులు సిగ్గుపడి నశిస్తారు గాక. నాకు కీడుచేయాలని చూసేవాళ్ళు నిందలపాలై అవమానం పొందుతారు గాక.
యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు.
ఆకలితో ఉన్నవాడు కలలో భోజనం చేసి మేలుకున్న తర్వాత వాడు ఇంకా ఆకలితోనే ఉన్నట్టుగా, దాహంతో ఉన్నవాడు కలలో నీళ్ళు తాగి మేలుకున్న తర్వాత వాడు ఇంకా దాహంతోనే ఉన్నట్టుగా అవును, అలాగే సీయోను కొండపై జాతుల సమూహం చేసే యుద్ధం కూడా ఉంటుంది.
¶ నువ్వు కూర్చోవడం, బయటికి వెళ్ళడం, లోపలి రావడం, నా మీద రంకెలు వేయడం నాకు తెలుసు.
¶ అనేక రాజ్యాల ప్రజలు మీకు విరోధంగా వచ్చి, “సీయోను అపవిత్రం అవుతుంది గాక! దాని నాశనం మేము కళ్ళారా చూడాలి.” అంటారు.
¶ భూమిపై ఉన్న ఇతర జాతులన్నీ యెరూషలేముకు విరోధంగా సమకూడతాయి. ఆ రోజుల్లో నేను యెరూషలేమును సమస్త జాతులకు బరువైన రాయిగా చేస్తాను, దాన్ని తొలగించాలని చూసేవాళ్ళంతా గాయాలపాలు అవుతారు.”
ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.