All books in తెలుగు IRV

కీర్తన 133

తెలుగు IRV · chapter 133

150 అధ్యాయాలు

తెలుగు IRV / కీర్తన / అధ్యాయం 133

తెలుగు IRV · chapter 133

1 చూడండి, సోదరులు ఐక్యంగా కలసి ఉండడం ఎంత మంచిది! ఎంత రమ్యమైనది!

2 అది ఆహరోను తలమీద పోసిన పరిమళ తైలం వంటిది. అది అహరోను గడ్డం నుండి అతడి అంగీ అంచులదాకా కారుతూ ఉన్న పరిమళ తైలం వంటిది.

3 అది సీయోను కొండల మీదికి దిగి వచ్చే హెర్మోను పర్వతం మంచులాంటిది. అక్కడ ఆశీర్వాదం ఉంటుందనీ అది శాశ్వతంగా నిలిచి ఉండే జీవమనీ యెహోవా సెలవిచ్చాడు.