యెహోవా, పీడితుల అవసరతలు నువ్వు విన్నావు. నువ్వు వాళ్ళ హృదయాన్ని బలపరుస్తావు. వాళ్ళ ప్రార్థన వింటావు.
TSK
TSK · కీర్తన 71:2
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
కీర్తన 10:17
TSK
కీర్తన 17:6
TSK
నేను నీకు నివేదన చేశాను. ఎందుకంటే నువ్వు నాకు జవాబిస్తావు. దేవా, నేను నీతో మాట్లాడినప్పుడు నా మాట నీ చెవిన పడనివ్వు.
కీర్తన 31:2
TSK
నా మాటలు ఆలకించి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించే బలమైన దుర్గంగా, ప్రాకారం గల కోటగా ఉండు.
కీర్తన 43:1
TSK
దేవా, నాకు న్యాయం తీర్చు. దైవభక్తిలేని ప్రజలతో నా తరుపున వాదించు.
కీర్తన 143:1
TSK
యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాలు అంగీకరించు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ న్యాయాన్ని బట్టి నాకు జవాబివ్వు.
దానియేలు 9:16
TSK
ప్రభూ, మా పాపాలనుబట్టి, మా పూర్వీకుల దోషాన్ని బట్టి, యెరూషలేము నీ ప్రజల చుట్టుపక్కల ఉన్న జాతులన్నిటి ఎదుట నింద పాలయింది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపాన్ని నీ రౌద్రాన్ని మళ్లించుకోమని నీ నీతిగల కార్యాలన్నిటిని బట్టి విన్నపం చేసుకుంటున్నాను.