TSK

TSK · రోమీయులకు రాసిన పత్రిక 13:7

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

మీలో ప్రతివాడూ తన తల్లిని తన తండ్రిని గౌరవించాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.

సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.

¶ కుమారా, యెహోవాను ఘనపరచు. రాజును ఘనపరచు. అలా చేయనివారి జోలికి పోకు.

ఆయన వెంటనే, ‹“అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి”› అని వారితో చెప్పాడు.

అందుకాయన, ‹“ఆలాగైతే సీజరువి సీజరుకు, దేవునివి దేవునికి చెల్లించండి”› అన్నాడు.

చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.

¶ సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి.

¶ చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి.

అందరినీ గౌరవించండి. తోటి సోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును గౌరవించండి.