TSK

TSK · 1 దిన 6:32

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ యోహానానుకి అజర్యా పుట్టాడు. ఈ అజర్యా యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరంలో యాజకత్వం జరిగించాడు.

¶ అతడు యెహోవా మందసం ముందు సేవ చేస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాను ఘనపరచడానికీ, కృతజ్ఞత చెల్లించడానికీ, ఆయనకు స్తోత్రాలు చెల్లించడానికీ లేవీయుల్లో కొందరిని నియమించాడు.

¶ యెహోవాకు పాటలు పాడడంలో నేర్పు గల తమ సహోదరులతో పాటు ఉన్న ప్రవీణులైన వాద్యకారుల లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది.

¶ హిజ్కియా యాజకులకూ, లేవీయులకూ వారి వారి సేవాధర్మం ప్రకారం, వారి వారి వరసలు నియమించాడు. దహనబలులూ సమాధాన బలులూ, శాంతి బలులూ అర్పించడానికీ, ఇతర సేవలూ చేయడానికీ యెహోవా మందిర గుమ్మాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికీ, స్తుతులు చెల్లించడానికీవారిని నియమించాడు.

రాతి చెక్కడం పనివారు యెహోవా మందిరం పునాది వేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దావీదు నిర్ణయించిన క్రమం ప్రకారం యాజకులు తమ వస్త్రాలు ధరించుకుని బాకాలతో నిలబడ్డారు. ఆసాపు వంశం వారైన లేవీయులు చేతి తాళాలతో యెహోవాను స్తుతించారు.

¶ ఆసాపుకు పుట్టిన జబ్దికి మనుమడూ, మీకా కొడుకు అయిన మత్తన్యా ప్రార్థన, స్తుతి గీతాల నిర్వహణలో ప్రవీణుడు. అతనికి సహాయులుగా తన సహోదరుల్లో బక్బుక్యా, యెదూతూ కొడుకు గాలాలు మనవడు షమ్మూయ కొడుకు అబ్దా ఉన్నారు.

¶ దావీదు, అతని కొడుకు సొలొమోను ఆదేశించినట్టు గాయకులు, ద్వారపాలకులతోపాటు తమ దేవునికి సేవ పనులను చేస్తూ, శుద్ధి ఆచారాలు పాటిస్తూ వచ్చారు.

యెహోవా సేవకులు, ఆయన మందిరంలో రాత్రివేళ నిలిచి సేవించే వాళ్ళంతా రండి. యెహోవాను కీర్తించండి.