TSK

TSK · 2 రాజులు 21:5

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

లోపల ఉన్న పెద్ద గదిని మూడు వరసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.

¶ రాజు బయలు దేవుడికీ, అషేరా దేవికీ, నక్షత్రాలకూ తయారు చేసిన వస్తువులన్నీ యెహోవా ఆలయంలోనుంచి బయటకు తీసుకు రావాలని ప్రధానయాజకుడు హిల్కీయాకు, రెండో వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. హిల్కీయా వాటిని యెరూషలేము బయట కిద్రోను పొలంలో తగలబెట్టి, ఆ బూడిద బేతేలు ఊరికి పంపేశాడు.

¶ ఇంకా యూదా రాజులు చేయించిన ఆహాజు మేడ గది మీద ఉన్న బలిపీఠాలనూ, యెహోవా మందిరపు రెండు ప్రాంగణాల్లో మనష్షే చేయించిన బలిపీఠాలనూ, రాజు పడగొట్టించి ముక్కలు ముక్కలుగా చేయించి ఆ చెత్త అంతా కిద్రోను వాగులో పోయించాడు.

యెహోవా మందిరపు రెండు ఆవరణాల్లో అతడు ఆకాశ నక్షత్ర సమూహానికి బలిపీఠాలను కట్టించాడు.

¶ ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరం లోపలి ఆవరణలో నన్ను దించాడు. అక్కడ చూస్తే, మందిర ద్వారం దగ్గర మంటపానికీ బలిపీఠానికీ మధ్యలో ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు. వారు తూర్పు వైపుకి తిరిగి ఉన్నారు. వాళ్ళ వీపులు వెనుక యెహోవా మందిరం వైపుకీ, ముఖాలు తూర్పు వైపుకీ ఉన్నాయి. వాళ్ళు తూర్పున ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు.

¶ తరవాత ఆయన నన్ను తూర్పు వైపున లోపలి ఆవరణలోకి తీసుకెళ్ళి దాని గుమ్మాన్ని కొలిచాడు. దానికి కూడా పైన చెప్పిన కొలతే.

¶ అతడు ఆ ఆవరణాన్ని కొలిచాడు. అది పొడవు, వెడల్పు సమానంగా 54 మీటర్లతో నలుచదరంగా ఉంది. మందిరానికి ఎదురుగా బలిపీఠం ఉంది.

ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణలోకి తెచ్చినప్పుడు యెహోవా మహిమ తేజస్సుతో మందిరం నిండి ఉంది.