TSK

TSK · నిర్గమ 27:1

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి “యెహోవా నిస్సీ” అని పేరు పెట్టాడు.

మోషే యెహోవా చెప్పిన మాటలన్నిటినీ రాశాడు. అతడు ఉదయాన్నే లేచి ఆ కొండ పాదం దగ్గర బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు ప్రజల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు స్తంభాలు నిలిపాడు.

¶ అతడు తుమ్మకర్రతో హోమ బలిపీఠం తయారుచేశాడు. దాని పొడవు, వెడల్పు ఐదు మూరలు. ఎత్తు మూడు మూరలు, దాన్ని చతురస్రంగా చేశారు.

¶ సన్నిధి గుడారం ఉన్న మందిరం ద్వారం ఎదురుగా హోమ బలిపీఠం ఉంచాలి.

యెహోవా హోమ బలిపీఠం మీద హోమబలి అర్పించి నైవేద్యం సమర్పించాడు.

¶ ఆ రోజున గాదు దావీదు దగ్గరికి వచ్చి “నీవు వెళ్లి యెబూసీయుడైన అరౌనా కళ్ళంలో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించు” అని అతనితో చెప్పాడు.

దైవసేవకుడు మోషే నియమించిన ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు దహన బలులు అర్పించడానికి యోజాదాకు కొడుకు యేషూవ, యాజకులైన అతని బంధువులు, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, అతని బంధువులు కలిసి ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠం కట్టారు.

¶ బలిపీఠం పొయ్యి ఎత్తు 2 మీటర్ల 10 సెంటి మీటర్లు. ఆ అగ్నిగుండం నుండి పైకి నాలుగు కొమ్ములున్నాయి.

¶ మనకు ఒక బలిపీఠం ఉంది. గుడారంలో సేవ చేసే వారికి దానిపై నుండి ఏదీ తినడానికి అధికారం లేదు.