యెహోవా ఆ విధంగా జరిగించాడు. బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి, ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి. ఈగల గుంపులమయమై ఆ దేశమంతా పాడై పోయింది.
TSK
TSK · నిర్గమ 8:4
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి. ఈ చావును తెచ్చే విపత్తును మాత్రం నా మీద నుండి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి” అన్నాడు.
¶ అప్పుడు రాజు “నా చెయ్యి తిరిగి బాగయ్యేలా నీ దేవుడు యెహోవా నా మీద దయ చూపేలా నా కోసం వేడుకో” అని ఆ దేవుని మనిషితో అన్నాడు. కాబట్టి దైవ సేవకుడు యెహోవాను వేడుకున్నాడు. రాజు చెయ్యి బాగై మునుపటి లాగా అయింది.
సోయను అధిపతులు బొత్తిగా మూర్ఖులు. ఫరో దగ్గర ఉన్న సలహాదారుల్లో అందరికన్నా జ్ఞాని అయిన వాడు ఇచ్చిన సలహా మతిలేనిదిగా కన్పిస్తుంది. ఫరోతో “నేను జ్ఞాని కొడుకును. నేను పూర్వ కాలంలోని రాజుల సంతతి వాణ్ణి” అని నువ్వు ఎలా చెప్తావు?
ఆమె గర్వాన్నీ, ఘనతా ప్రాభవాలనూ అగౌరవ పరచడానికీ, భూమి మీద ఘనత పొందిన ఆమె పౌరులను అవమాన పరచడానికీ సేనల ప్రభువైన యెహోవా సంకల్పించాడు.
ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు.