TSK

TSK · ఆది 16:3

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ అప్పుడు శారయి అబ్రాముతో “నా ఉసురు నీకు తగులుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను. ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన దగ్గరనుండీ అది కన్నూమిన్నూ గానక నన్ను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నీకూ నాకూ మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు” అంది.

అబ్రాహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపి వేశాడు.

తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో లైంగికంగా కలిశాడు.

¶ ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలనూ తన ఇద్దరు దాసీలనీ తన పదకొండు మంది పిల్లలనూ తీసుకు యబ్బోకు రేవు దాటిపోయాడు.

¶ ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేని ఆ రోజుల్లో ఎఫ్రామీయుల కొండ ప్రాంతాల్లోని ఉత్తర భాగంలో ఒక లేవీయుడు పరదేశిగా నివసించేవాడు. అతడు యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉంపుడుగత్తెగా తెచ్చుకున్నాడు.

అతనికి 700 మంది రాకుమార్తెలైన భార్యలూ 300 మంది ఉపపత్నులూ ఉన్నారు. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు.