TSK

TSK · ఆది 23:2

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

అప్పుడు అబ్రాము తన గుడారం తీసి, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.

అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారం లోకి ఆమెను తీసుకు వెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు.

¶ యోసేపు తన తండ్రి మీద వాలి ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు.

వారు దక్షిణం వైపు నుండి ప్రయాణం చేసి హెబ్రోనుకి వచ్చారు. అక్కడ అనాకు వంశం వారు అయిన అహీమాను, షేషయి, తల్మయి అనే తెగల ప్రజలు ఉన్నారు. ఆ హెబ్రోను పట్టణాన్ని ఐగుప్తులో ఉన్న సోయను పట్టణం కంటే ఏడేళ్ళు ముందుగా కట్టారు.

ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాల్లో మోషే కోసం 30 రోజులపాటు దుఃఖించారు. తరువాత మోషే కోసం దుఃఖించిన రోజులు ముగిసాయి.

ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాడు కాబట్టి హెబ్రోను కాలేబుకు నేటివరకూ స్వాస్థ్యంగా ఉంది.

ఇంకా యూదా వంశం వారు హెబ్రోనులో ఉన్న కనానీయుల మీదికి వెళ్లి, షేషయిని, అహీమానుని, తల్మయిని హతం చేశారు.

¶ సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా సమావేశమై అతని కోసం ఏడ్చారు. రమాలో ఉన్న అతని సొంత ఇంట్లో సమాధి చేశారు. తరువాత దావీదు లేచి పారాను అరణ్య ప్రాంతానికి వెళ్లిపోయాడు.

సౌలూ, యోనాతానూ యెహోవా ప్రజలూ ఇశ్రాయేలు వంశీకులూ యుద్ధంలో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు.

దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు హెబ్రోనులో ఉండి యూదా వారిని పరిపాలించాడు.

హెబ్రోనులో అతడు యూదా గోత్రం వారిని ఏడేళ్ళ ఆరు నెలలు, యెరూషలేములో ఇశ్రాయేలు, యూదా గోత్రాల ప్రజలను ముప్ఫై మూడు ఏళ్ళు పాలించాడు.

¶ యిర్మీయా యోషీయాను గురించి శోక గీతం రాశాడు. గాయకులూ గాయకురాండ్రంతా ఇప్పటికీ యోషీయా కోసం ఆ పాట పాడుతూ దుఃఖిస్తారు. ఈ గీతాలు ఇశ్రాయేలులో వాడుక అయ్యాయి. విలాప వాక్యాల్లో అలాంటివి రాసి ఉన్నాయి.

కాబట్టి యోషీయా కొడుకు యెహోయాకీము అనే యూదా రాజు గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రజలు, అయ్యో నా సోదరా! అయ్యో నా సోదరీ” అని అతని గురించి ఏడవరు. “అయ్యో, యజమానీ! అయ్యో, ఘనుడా” అని అతని కోసం ఏడవరు.

మరియతో ఇంట్లో ఉండి ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్ళడం చూసి ఆమె వెంట వెళ్ళారు. ఆమె ఏడవడానికి సమాధి దగ్గరికి వెళ్తూ ఉందని వారు అనుకున్నారు.

కాబట్టి, అపొస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాల్లోకి చెదరి పోయారు. భక్తిపరులైన మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి చాలా దుఖించారు.