TSK

TSK · ఆది 30:2

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

ఎందుకంటే దేవుడైన యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి అబీమెలెకు ఇంట్లో స్త్రీలందరినీ పూర్తిగా గొడ్రాళ్ళనుగా చేశాడు.

¶ అతడు లేయాను ప్రేమించక పోవడం చూసి యెహోవా ఆమె గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలుగా ఉంది.

యోసేపు “భయపడవద్దు. నేను దేవుని స్థానంలో ఉన్నానా?

ఆయన మిమ్మల్ని ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి పరుస్తాడు. మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులు, గొర్రెలు, మేకల మందలను దీవిస్తాడు.

తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు. ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది. ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది.

ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.

‹అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.›

¶ “స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది.